- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మత్స్యకార కుటుంబాలకు జగన్ పరామర్శ : పోలీసులతో మాజీమంత్రి బొత్స వాగ్వాదం
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా కొద్దిసేపటి క్రితమే జబ్బర్ తోటలో మత్స్యకార కుటుంబాలను పరామర్శించారు.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా కొద్దిసేపటి క్రితమే జబ్బర్ తోటలో మత్స్యకార కుటుంబాలను పరామర్శించారు. జగన్ రాకతో విశాఖ సౌత్ నియోజకవర్గ వీధులన్నీ మరో సాగరాన్ని తలపించాయి. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన చిన్నాను పరామర్శించి.. ఆ రోజు ఏం జరిగిందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలు తమ కష్టాలను జగన్ కు విన్నవించగా.. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని జగన్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విశాఖలో ఇటీవల పడవ గల్లంతు ప్రమాదంలో మరణించిన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు జబ్బర్ తోటలోని వారి నివాసప్రాంతాలకు వెళ్లారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున కార్యకర్తలు తరలిరావడంతో.. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన బొత్స.. రాజకీయాలు తనకు నేర్పిస్తారా అంటూ పోలీసులపై ఫైరయ్యారు. వారందరినీ తన వెంట అనుమతించాలని ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.






