- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు అంబటి రాంబాబు ఇంటికి జగన్..
జైలులో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి భరోసా నింపేందుకు నేరుగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో మాజీ మంత్రులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. వాళ్లను పరామర్శించేందుకు రంగంలోకి దిగారు జగన్. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
అంబటి రాంబాబు ఇంటికి వైయస్ జగన్
అరెస్ట్ అయి, జైలులో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి భరోసా నింపేందుకు నేరుగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ఇవాళ అంబటి రాంబాబు కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. ఉదయం 10 గంటల సమయంలో తాడేపల్లి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో గుంటూరుకు వెళ్తారు. ఇక ఉదయం 11 గంటల సమయంలో గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి చేరుకుంటారు జగన్.
అయితే గుంటూరు పరిధిలో 1861 లోని సెక్షన్ 30 అమలులో ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ ర్యాలీ, సమావేశం నిర్వహించడం, అందులో పాల్గొనడం నిషేధం అంటూ ఇప్పటికే పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రూల్స్ బ్రేక్ చేసిన వారిని అరెస్టు చేస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనపై తీవ్ర ఆసక్తి నెలకొంది.






