జగన్.. అసత్య ప్రచారాలు మానుకో.. మంత్రి గొట్టిపాటి హితవు

by Thanuru Gopichand |

విద్యుత్తు (Power) కొనుగోళ్లపై జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు.

జగన్.. అసత్య ప్రచారాలు మానుకో.. మంత్రి గొట్టిపాటి హితవు
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యుత్తు (Power) కొనుగోళ్లపై జగన్ (YS Jagan) అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravi) ఆరోపించారు. వైసీపీ (YCP) హయాంలో కేవలం రూ.2.49 కే కొనుగోలు చేశామని చెప్పటం వట్టి అబద్ధం అన్నారు. దాదాపు రూ.5కు పైనే యూనిట్ విద్యుత్ కొనుగోలు చేశారు అని తెలిపారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ యాక్సిస్ (Axis) కంపెనీతో కూటమి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం వందశాతం సక్రమమే అని తెలిపారు. సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజ్ తో చేస్తున్న తొలి ప్రాజెక్టు ఏపీలోనే పెట్టుబడి పెట్టింది అన్నారు. పీక్ అవర్స్ లో రూ.8 నుంచి రూ.10 వరకు కొనాల్సి వచ్చే సమస్యను ఇది అధిగమిస్తుంది అన్నారు. స్వలాభం కోసం జగన్ చేసుకున్న విద్యుత్తు ఒప్పందాలకు, తాము చేసుకుంటున్నా ఒప్పందాలకు ఎంతో తేడా ఉందని తెలిపారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసగించే ప్రయత్నం ఇప్పటికైనా జగన్ మానుకోవాలని హితవు పలికారు. అవినీతిలో మునిగి తేలిన జగన్కు.. తాము చేసే మంచి కూడా చెడుగానే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. పెట్టుబడిదారులను తరిమికొట్టిన చరిత్ర జగన్ దేని నిజమేనారు. పెట్టుబడులతో ఆదాయం , ఉపాధి కల్పిస్తున్న ఘనత చంద్రబాబుది అని తెలిపారు. జగన్ యూనిట్ రూ.2.49 చొప్పున కొంటేనే తెగ గగ్గోలు పెట్టావ్.. మరి ఇప్పుడు నువ్వు యూనిట్ రూ.4.60 చొప్పున ఎలా కొంటున్నావ్ చంద్రబాబు? .. అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో ఆరోపణలు చేసింది. దీనికి మంత్రి గొట్టిపాటి ఈరోజు వివరణ ఇచ్చారు

Next Story