- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News:‘జగన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నారు’..డిప్యూటీ సీఎం పవన్ సెన్సేషనల్ కామెంట్స్!
ఏపీలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..వైఎస్ జగన్‌కు ఇంకా తత్వం బోధపడలేదని అన్నారు. ‘ఇప్పటికీ తానే సీఎం అనుకుంటున్నారేమో?’..నూతన ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా గడవక ముందే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వినుకొండలో చోటుచేసుకున్న గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమారని విమర్శించారు. అవాస్తవాలతో కుట్రలకు తెరలేపుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికీ తానే సీఎం అని జగన్ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎల్లకాలం సీఎంగానే ఉంటాననే భ్రమల్లోంచి ఆయనను ప్రజలు బయట పడేశారని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు తీసుకునే ప్రతి నిర్ణయానికి తాను, తమ పార్టీ చంద్రబాబుకు తాను, తమ పార్టీ వంద శాతం సహకరిస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
Read More..






