- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థిని తన్మయి ఘటనపై జగన్ సంచలన ట్వీట్
అనంతపురం విద్యార్థిని తన్మయి మర్డర్ మిస్టరీ వీడిన తరుణంలో జగన్ సంచలన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం విద్యార్థిని తన్మయి మర్డర్ మిస్టరీ వీడిన తరుణంలో జగన్ సంచలన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. శాంతి భద్రతల నిర్వహణలో చంద్రబాబు వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉందని చురకలు అంటించారు. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్యచేశారని ఫైర్ అయ్యారు.
ఈ నెల జూన్ 3న తమ కుమార్తె కనిపించడంలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ... ఆ అమ్మాయిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీరియస్ అయ్యారు. ఆరు రోజుల తర్వాత కూడేరు మండలం బ్రాహ్మణపల్లె సమీపంలో తన్మయి మృతదేహాన్ని గుర్తించారన్నారు. తన్మయి హత్య పూర్తిగా యంత్రాంగ వైఫల్యమే అంటూ ఫైర్ అయ్యారు. ఒక అమ్మాయి కనిపించడంలేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ పోలీసులు ఏంచేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? అని నిలదీశారు.
ఆరు రోజుల క్రితం ఫిర్యాదు వచ్చినా సరే ఎందుకు పట్టించుకోలేదు? అని ఫైర్ అయ్యారు. అసలు రాష్ట్రలో కేసుల దర్యాప్తు మీద, నేరాల అదుపుమీద అసలు దృష్టి ఉందా? అని నిల దీశారు. కేవలం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప.. ఈ ప్రభుత్వానికి ప్రజల రక్షణపట్ల బాధ్యత అనేది ఉందా? అని ప్రశ్నించారు. తన్మయి హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు జగన్.






