‘వై నాట్ 175’ అన్న జగన్.. అడ్రస్ లేకుండాపోయాడు.. మంత్రి నారాయణ హాట్ సెటైర్లు

by Kema Shiva Kumar |

మూడు రోజుల మహానాడు (Mahaanadu) ముచ్చటగా ఇవాళ సాయంత్రం ముగియనుంది.

‘వై నాట్ 175’ అన్న జగన్.. అడ్రస్ లేకుండాపోయాడు.. మంత్రి నారాయణ హాట్ సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: మూడు రోజుల మహానాడు (Mahaanadu) ముచ్చటగా ఇవాళ సాయంత్రం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే చివరి రోజు బహిరంగ సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నాయకులు, కార్యకర్తలు తండోపతండాలుగా పోటెత్తున్నారు. కడప (Kadapa) శివారులోని చెర్లోపల్లి సమీపంలో మధ్యాహ్నం 2 గంటలకు భారీ బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే మహానాడు వేదిక వద్ద మంత్రి నారాయణ (Minister Narayana) మాట్లాడుతూ.. ప్రస్తుతం పార్టీని కొవర్టుల నుంచి కాపాడుకునే పనిలో ఉన్నామని.. వారిని గుర్తించేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ‘వై నాట్ 175’ అన్న జగన్ (Jagan) ఇప్పుడు అడ్రెస్ లేకుండా పోయాడని కామెంట్ చేశారు. రానున్న రోజుల్లో వైసీపీ కనుమరుగు అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. వైసీపీ (YCP) నేతల మాటలకు అసలు విలువ లేదని అన్నారు. రెండు రోజుల పాటు కపడలో మహానాడు బ్రహ్మాండంగా జరగిందని అన్నారు. అనుకున్న దానికన్నా ఎక్కువ మంది సభకు హాజరయ్యారని పేర్కొన్నారు. అగస్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం కాబోతోందని నారాయణ తెలిపారు.

Next Story