తన ఫోటో పెట్టుకుని విజయ్ సీఎం అయ్యాడన్న ప్రచారంపై స్పందించిన జగన్

by Ajay Maddhiboyina |

ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఆంధ్రా సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల్లో టీవీకే విజయ్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరవాత ఎవరూ ఊహించని రీతిలో సీట్లు రావడంతో పాటు సీఎం సీటుపైనే విజయ్ కూర్చున్నారు.

తన ఫోటో పెట్టుకుని విజయ్ సీఎం అయ్యాడన్న ప్రచారంపై స్పందించిన జగన్
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఆంధ్రా సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల్లో టీవీకే విజయ్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరవాత ఎవరూ ఊహించని రీతిలో సీట్లు రావడంతో పాటు సీఎం సీటుపైనే విజయ్ కూర్చున్నారు. మొదటి ఎన్నికల్లోనే దక్కిన విజయాన్ని విజయ్ సైతం ఊహించుకోలేకపోయారు. అయితే తమిళనాడులో టీవీకే గెలిచిన తరవాత కొంతమంది జగన్ వల్లనే విజయ్ ఆయా అసెంబ్లీ స్థానాల్లో గెలిచాడు అంటూ ప్రచారం చేశారు. దీనిపై తాజాగా జగన్ స్పందించారు. వైసీపీ నేతలతో జరిగిన భేటీలో ఒకరు.. తమిళనాడులో విజయ్ గెలుపుకు మీ ఫోటో పట్టుకుని ప్రచారం చేయడమే కారణం అని అంటున్నారని చెప్పారు.

దీంతో జ‌గ‌న్ మాట్లాడుతూ.. ఆయ‌న రాష్ట్రంలో ఆయ‌న‌కే ఎక్కువ ప‌లుకుబ‌డి ఉంటుంది నాకు ఎలా ఉంటుంది అని అన్నారు. ఇక విజ‌య్ కేవ‌లం జ‌గ‌న్ ఫోటో మాత్ర‌మే కాకుండా ఏ ప్రాంతంలో ప్ర‌చారం చేస్తే ఆ ప్రాంతం వాసులు క‌నెక్ట్ అయ్యేలా ఫోటోల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ప్ర‌చారం చేశారు. అయితే విజ‌య్ కి జ‌గ‌న్ కు ముందు నుండే మంచి సంబంధాలు ఉన్నాయ‌నే ప్ర‌చారం మాత్రం ఉంది. ఎన్నిక‌ల ముందు సైతం వీరిద్ద‌రూ క‌లుసుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా జ‌గ‌న్ బంధువుల వివాహానికి సైతం విజ‌య్ హాజ‌ర‌య్యారు. విజ‌య్ గెలిచిన త‌ర‌వాత కూడా జ‌గ‌న్ ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఈక్ర‌మంలోనే జ‌గ‌న్ గెలిపించార‌నే ప్ర‌చారం జోరుగా జ‌ర‌గ్గా ఇప్పుడు వాటిపై ఆయ‌న క్లారిటీ ఇచ్చేశారు.

Next Story