'నో వర్క్ నో పే' విధానంపై స్పందించిన జగన్

by Vemula.Srinu Prasad |

తన ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఇచ్చే జీతంపై ఆధారపడేంత లేనోళ్లు కాదని జగన్ మోహన్ రెడ్డి అన్నారు..

నో వర్క్ నో పే విధానంపై స్పందించిన జగన్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వం ఇచ్చే జీతంపై ఆధారపడేంత లేనోళ్లు తమ ఎమ్మెల్యేలు కాదని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) అన్నారు. అసెంబ్లీకి హాజరుకాని ఎమ్మెల్యేల(Mla)కు 'నో వర్క్ నో పే'(No Work-No Pay) విధానం అమలు చేయాలన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. జీతాల విషయంలో వర్రీ అవసరంలేదన్నారు. నో వర్క్ నో పేపై వాళ్లనే అడగాలని జగన్ వ్యాఖ్యానించారు.

నో వర్క్.. నో పేపై స్పీకర్ వ్యాఖ్యలు

కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్ ఇప్పటివరకూ ఒకసారి మినహా ఎప్పుడూ కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. అటు వైసీపీ ఎమ్మెల్యేలు సైతం సభకు వెళ్లలేదు. దీంతో వాళ్ల జీతాలు నిలిపివేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌లో నిర్వహించిన వివిధ రాష్ట్రాల శాసనసభాపతుల సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు(Speaker Ayyanna Patrudu) ప్రస్తావించారు. చట్టసభలకు హాజరు కాని సభ్యుల జీతభత్యాల్లో కోత విధించాలని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.

Next Story