మీకు నచ్చిన బుక్‌లో రాసుకోండి, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం..మరోసారి జగన్ వార్నింగ్

by Ajay Maddhiboyina |

వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని కూటమి నేతల కనుసన్నల్లో కొందరు అధికారులు పనిచేస్తున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. వారికి రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తామని వార్నింగ్ ఇచ్చారు.

మీకు నచ్చిన బుక్‌లో రాసుకోండి, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం..మరోసారి జగన్ వార్నింగ్
X

దిశ‌, వెబ్ డెస్క్: వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని కూటమి నేతల కనుసన్నల్లో కొందరు అధికారులు పనిచేస్తున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. వారికి రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తామని వార్నింగ్ ఇచ్చారు. స్థానిక సంస్థల ప్రతినిధుల భేటీలో జగన్ మాట్లాడారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని అన్నారు. తప్పుడు కేసులతో పాటూ దొంగ సాక్ష్యాలు సృష్టిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప‌ల్నాడులో టీడీపీలోని రెండు వర్గాల మ‌ధ్య ఆధిప‌త్యపోరులో హ‌త్య‌లు జ‌రిగాయని చెప్పారు.

టీడీపీలో గ్రూపు త‌గాదాలే దీనికి కార‌ణమ‌ని ఎస్పీ చెప్పార‌ని, ఇప్పుడు వైసీపీ ఇంఛార్జ్ పిన్నెల్లి మీద కేసులు పెట్టార‌ని అన్నారు. ఇల్లీగ‌ల్ మైనింగ్ జ‌ర‌గ‌లేద‌ని అధికారులు రిపోర్టు ఇస్తే త‌ప్పుడు కేసులు సెక్ష‌న్లు పెట్టి మాజీ మంత్రి కాకాణిని అరెస్ట్ చేశార‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో చ‌ట్టం, రాజ్యాంగం ఉల్లంఘ‌న‌కు గుర‌వుతోంద‌న్నారు. ఈ సారి 2.0లో కార్య‌క‌ర్త‌ల‌కు ప్రాధాన్య‌త ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. అభివృద్ధి సంక్షేమంతో పాటూ కార్య‌క‌ర్త‌ల బాగోగులు చూసుకుంటామ‌న్నారు. కార్య‌క‌ర్త‌ల‌కు ఎవ‌రు అన్యాయం చేసినా న‌చ్చిన పుస్త‌కంలో రాసి పెట్టుకోవాల‌ని సూచించారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర‌వాత వ‌డ్డీతో స‌హా రిట‌ర్న్ గిఫ్టులు ఇస్తామ‌ని హెచ్చ‌రించారు,

Next Story