- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైసీపీ కార్యకర్తలకు జగన్ హెచ్చరిక !
నకిలీ లింకులు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయని,,వాటిని కార్యకర్తల క్లిక్ చేయకండి అంటూ వైసీపీ పోస్ట్ వైరల్ గా మారింది.

jagan key orders to ycp party cadre
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ కార్యకర్తలకు అలర్ట్. తాజాగా ఏపీలో ఉన్న వైసీపీ కార్యకర్తలకు అధిష్టానం నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చినట్లు సమాచారం. సోషల్ మీడియాలో నకిలీ లింకులు క్లిక్ చేయకూడదని వైసీపీ పార్టీ అధిష్టానం కోరిందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో వైసీపీ క్యాడర్ పేరుతో కొన్ని నకిలీ లింకులు సోషల్ మీడియాలో తిరుగుతున్నట్లు పార్టీ అధిష్టానం గుర్తించినట్లు చెబుతున్నారు.
జాగ్రత్త.. ఆ లింకులు ఓపెన్ చేయెద్దు !
కార్యకర్తల వ్యక్తిగత వివరాలు సేకరించడానికి ఈ లింకులు పంపిస్తున్నట్లు వైసీపీ అధిష్టానం గుర్తించి, అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఎవరైనా ఇలా పంపిన లింకులు నమ్మి, వెంటనే క్లిక్ చేయకూడదని కోరిందని..ఈ మేరకు వైసీపీ కార్యకర్తలను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ అధికారికంగా ఇచ్చిన లింకు ద్వారానే క్యాడర్ ID కార్డ్ చెక్ చేసుకోవాలని, తెలియని లింకులు అస్సలు క్లిక్ చేయకూడదని పేర్కొన్నట్లు సమాచారం. అలా ఏది పడితే అది క్లిక్ చేస్తే, మీ వ్యక్తిగత డేటా ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు వైసీపీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. వైసీపీ పార్టీ సోషల్ మీడియా కుటుంబం అంతా అప్రమత్తంగా ఉండాలని జగన్ టీమ్ హెచ్చరిక జారీ చేస్తున్నట్లు ఓ పోస్టు వైరల్ అయింది.






