- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ రోజులు పోయాయ్.. అద్దంకి నేతల సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు
సీఎం చంద్రబాబును చూసి ఎవరూ భయపడొద్దని, ఆ రోజులు పోయాయని అద్దంకి నేతలకు మాజీ సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ..

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(Cm Chandrababu )ను చూసి ఎవరూ భయపడొద్దని, ఆ రోజులు పోయాయని అద్దంకి నేతలకు మాజీ సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రకాశం జిల్లా(Prakasam District) అద్దంకి(Addanki)లో నియోజకవర్గ వైసీపీ నేతల(Ycp leader) ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్(Jagan) మాట్లాడుతూ పాలనలో తనకేంటి అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు చెబుతున్న మాటలు కోటలు దాటిపోతున్నాయని విమర్శించారు. ప్రతి విషయంలోనూ క్రెడిట్ చోరీ జరుగుతోందన్నారు. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్(ArcelorMittal Steel Plant)కు సంబంధించి కూడా వైసీపీ క్రెడిట్‌ను చంద్రబాబు చోరీ చేశారని విమర్శించారు. తమ హయాంలోనే ఆర్సెల్ మిట్టల్ వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు తమ వల్లే వచ్చినట్టుగా చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారన్నారు. గూగుల్ విషయంలోనూ ఇదే జరిగిందని ఎద్దేవా చేశారు. జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన ఒక శుభవార్త అని, మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయన్నారు. తన పాలనలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని జగన్ గుర్తు చేశారు. పదవుల్లోనూ, కాంట్రాక్టుల్లోనూ మనం మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చామని, ఇప్పుడు చట్టసభల్లో మరిన్ని సీట్లు రాబోతున్నాయని జగన్ పేర్కొన్నారు.






