తెర వెనుక పొత్తులకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ : వైఎస్ షర్మిల ఫైర్

by Muthe.Rajitha |   (  Updated:2025-08-14 16:45:48  IST  )

ఏపీ మాజీ సీఎం, వైస్సార్సీపీ అధినేత జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.

తెర వెనుక పొత్తులకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ : వైఎస్ షర్మిల ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ సీఎం, వైస్సార్సీపీ అధినేత జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. తెరవెనుక పొత్తులకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఎద్దేవా చేశారు. పొత్తుల విషయంలో ఆయనకు నీతి మాలిన చరిత్ర ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మోడీకి జగన్ వంగి వంగి దండాలు పెట్టారని, పార్లమెంటులో ఆ పార్టీ ప్రవేశపెట్టిన బిల్లులకు ఆ పార్టీ ఎంపీలు సంపూర్ణ మద్దతు ఇచ్చారని తెలిపింది. దేశం కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తుంటే, ఆయనపై విమర్శలు చేస్తారా అంటూ మండిపడ్డారు.

మోడీకి మద్దతు ఇస్తున్నట్టు మాట్లాడుతున్న మీరో నాయకుడు, మీదో పార్టీనా అంటూ మండిపడ్డారు. జగన్ లా మందిని వేసుకొని వెళ్లి యాత్రలు చేయడం, జనం మీదికి కార్లు ఎక్కించడం రాహుల్ కు తెలియదని విమర్శించారు. తప్పుడు పనులు చేసి అరెస్ట్ అయిన నేతలను కలవడానికి మీరు వెళ్లినట్టు రాహుల్ ఎన్నడూ చేయలేదని షర్మిల ఫైర్ అయ్యారు.

Next Story