- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజల తీర్పును జగన్ అవమానిస్తున్నారు
by Thanuru Gopichand |
ప్రజలు ఇచ్చిన తీర్పును వైఎస్ జగన్ అవమానిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలు ఇచ్చిన తీర్పును వైఎస్ జగన్ అవమానిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో జగన్, వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై మంత్రి స్పందించారు. ప్రతిపక్ష హోదా అడగడానికి మాత్రమే అసెంబ్లీకి రావడం చట్ట సభల్ని కించపరచడమేనని చెప్పారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సింది పోయి.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజల పక్షాన నిలబడతామని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే జగన్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు. ప్రజాతీర్పుని గౌరవించకుంటే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చురకలంటించారు.
Next Story






