- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్‌కు అసహనం అందుకే.. చంద్రబాబు వ్యాఖ్య
పులివెందులలో తాను అనుకున్నట్లు అరాచకం జరగలేదని వైఎస్జగన్అసహనం చెందుతున్నాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో : పులివెందులలో తాను అనుకున్నట్లు అరాచకం జరగలేదని వైఎస్జగన్అసహనం చెందుతున్నాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈరోజు ఆయన పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు విచ్చేశారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా పలువురికి ఆర్థిక సాయం అందజేశారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక పై మీడియా ప్రశ్నలకు చంద్రబాబు జవాబు ఇచ్చారు. పులివెందుల ప్రజలు ఇప్పుడిప్పుడే అరాచకం నుంచి బయటపడుతున్నారని తెలిపారు. ఈసారి అరాచకాలు జరగలేదని అసహనంతో జగన్ ఉన్నాడని అన్నారు. జగన్ వైఖరి ఎలాంటిదో ప్రజలు అందుకు తెలిసిందే అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని తెలిపారు. నామినేషన్ వేసేందుకే భయపడే పరిస్థితి నుంచి 11 మంది పోటీ చేశారని తెలిపారు. రెండు పోలింగ్‌బూత్‌లలో ఎప్పుడైనా రీపోలింగ్ జరిగిందా అని ప్రశ్నించారు. శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నందునే ప్రజలు ఓటు వేశారని తెలిపారు. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న.భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. భారీ వర్షాల కారణంగా పలువురు మరణించడం బాధాకరం అన్నారు. నష్ట నివారణకు ఎక్కడికక్కడ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో సంబంధిత మంత్రులు అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారని తెలిపారు.






