- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్‌కు జంగిల్‌రాజ్ అవార్డు ఇవ్వాలి : మంత్రి కొల్లు రవీంద్ర
ఆటవిక రాజ్యమంటే ఎలా ఉంటుందో జగన్ తన ఐదేళ్ల పాలనలో ప్రజలకు చూపించారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆటవిక రాజ్యమంటే ఎలా ఉంటుందో జగన్ తన ఐదేళ్ల పాలనలో ప్రజలకు చూపించారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్‌పై విమర్శలు గుప్పించారు. జగన్‌కు జంగిల్‌రాజ్ అవార్డు ఇవ్వాలన్నారు. జగన్ ఆటవిక పాలనలో పార్టీ కార్యాలయాలు, దేవాలయాలపై దాడులు చేయించారని మండిపడ్డారు. పరామర్శలకు వెళ్తూ.. వాటి వెనుక జరుగుతున్న విద్వేషాల వెనుక ఉన్నది తానేనని జగన్ చాటుకుంటున్నారన్నారు.
రాష్ట్ర సీఎంను బూతులు తిట్టి టీడీపీ నేతలను రెచ్చగొట్టి తన్నులు తిన్నవారిని పరామర్శించేందుకు జగన్ వెళ్లడం, దానివెనుక వ్యక్తులు చనిపోవడం, విద్వేషాలు రేగడం వంటివి జరుగుతూనే ఉన్నాయన్నారు. తెనాలిలో బ్లేడ్ బ్యాచ్ ను పరామర్శించేందుకు వెళ్లి.. విద్వేషాలు రెచ్చగొట్టేవారినే ప్రోత్సహస్తానన్న సందేశమిచ్చారన్నారు. ఇలాంటి చర్యల కారణంగానే ఆ పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిందని గుర్తుచేశారు. 151 నుంచి 11 స్థానాలకు వైసీపీ పతనమైందన్నారు. ఇప్పటికైనా వైసీపీ బుద్ధి తెచ్చుకుని మారకుంటే.. అథఃపాతాళానికి పడిపోవడం ఖాయమన్నారు.






