Lokesh, Jagan: జగన్ అహంకారి.. మంత్రి లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

by Thanuru Gopichand |

అహంకారానికి షర్టు, ప్యాంటు వేస్తే జగన్‌లా ఉంటుందని మంత్రి నారా లోకేశ్ఎ ద్దేవా చేశారు.

Lokesh, Jagan: జగన్ అహంకారి.. మంత్రి లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అహంకారానికి షర్టు, ప్యాంటు వేస్తే జగన్‌లా ఉంటుందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ప్రజలు నిర్ణయించారన్నారు. ఆ విషయం జగన్‌కు (YS Jagan) ఎందుకు అర్థం కావడం లేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజలకు జగన్ దూరంగానే ఉన్నారని తెలిపారు. పరదాల ప్రభుత్వం పోయాక రాష్ట్రంలో పరదాల అమ్మకాలు తగ్గాయని సెటైర్ వేశారు. 11 సీట్లు ఎందుకు వచ్చాయో ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని హితవు పలికారు. పవన్​కల్యాణ్‌కు (Pawan Kalyan) వచ్చిన మెజారిటీ ఎంత, జగన్‌కు వచ్చిన మెజారిటీ ఎంత? అని ప్రశ్నించారు. జగన్​తల్లి, చెల్లి కూడా అతనిని నమ్మడం లేదన్నారు. గతంలోఅమరావతి, పోలవరం పనులను ఎందుకు ఆపారని ప్రశ్నించారు. చట్టాల్ని ఉల్లంఘించిన ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌ను గుర్తించలేమన్నారు. జగన్‌కు అధికారం వస్తే సీబీఐని మూసేస్తారని ఆరోపించారు. రాష్ట్రానికి రూ.6లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని లోకేశ్ తెలిపారు.

Next Story