- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
YS Jagan: అమరావతిలో సందడి వేళ.. బెంగళూరులో జగన్!
అమరావతిలో పండుగ వాతావరణం నెలకొంది. రాజధాని పనుల పున:ప్రారంభ వేళ దేశం మొత్తం ఇటువైపే చూస్తోంది.

అప్పుడూ అంతే.. ఇప్పుడూ అంతే
ప్రధాని ప్రకటన తర్వాతే మనసులో జగన్మనసులో మాట వెల్లడి?
దిశ, డైనమిక్ బ్యూరో: అమరావతిలో (Amaravathi) పండుగ వాతావరణం నెలకొంది. రాజధాని పనుల పున:ప్రారంభ వేళ దేశం మొత్తం ఇటువైపే చూస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఈ క్రతువులో పాల్గొననునారు. అయితే ఏపీలో తనను ప్రతిపక్ష నేతగా గుర్తంచాలని కోరుకుంటున్న వైఎస్జగన్ఈ సమయంలో రాజధాని ప్రాంతం నుంచి వెళ్లపోయారు. నిన్న సాయంత్రమే ఆయన బెంగళూరుకు వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ ప్రభుత్వం నుంచి జగన్కు ఆహ్వానం అందింది. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో అధికారులు ఆహ్వాన పత్రికను ఆయన పర్సనల్సెక్రటరీకి అందజేశారు. అయితే స్వయంగా ప్రధాని హాజరవుతున్న సభకు జగన్రావడానికి ఆసక్తి చేపలేదు.
2015లోనూ అమరావతి పనుల ప్రారంభోత్సవానికి అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న జగన్కు ప్రభుత్వం ఆహ్వానాన్ని పలికింది. అయితే ఆ సమయంలోనూ ఆయన హాజరు కాలేదు. అప్పుడు ఉద్దండ్రాయునిపాలెంలో ప్రధాని మోదీనే అమరావతి పనులకు శంకుస్తాపన చేశారు. జగన్అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మూడు రాజధానులంటూ కొత్తరాగం అందుకున్నారు. ఆయన ప్రతిపాదనకు వ్యతిరేకంగా రాజధాని రైతులు ఉద్యమించారు. దాదాపు మూడేళ్ల పాటు సుదీర్ఘ ఉద్యమాన్ని నడిపారు. మొన్నటి ఎన్నికల్లో జగన్ అధికారం కోల్పోగానే అమరావతిపై పునరాలోచనలో పడ్డట్టు రాజకీయ పరిశీలకులు భావించారు. ఆయన హుందాగా నేడు జరగబోయే కార్యక్రమానికి హాజరవుతారని కొంతమంది భావించారు. అయితే ఆయన ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆయన ఈ కార్యక్రమానిక డుమ్మా కొట్టినట్లు అని భావిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు రాజధానికి సంబంధించిన కీలక ప్రకటన చేస్తారని అంతా భావిస్తున్నారు. ఆయన ప్రకటన తర్వాత వైఎస్జగన్రాజధానిపై స్పందిస్తారని, తన మనసులో ఉన్న మాటను వెల్లడిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్పటి వరకు అమరావతిపై తన స్టాండును జగన్బయట పెట్టబోరని, పార్టీ నేతలు కూడా ఎక్కడా దీనిపై వ్యాఖ్యలు చేయవద్దని కూడా సూచించినట్లు సమాచారం.






