- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైసీపీ జెండాను తలకిందులుగా ఎగురవేసిన జగన్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ( Jagan).. పల్నాడు ( Palnadu) పర్యటనలో చిన్నపాటి తప్పిదం

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ( Jagan).. పల్నాడు ( Palnadu) పర్యటనలో చిన్నపాటి తప్పిదం జరిగింది. వైసీపీ పార్టీ జెండాను ( YCP Flag)... వైయస్ జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా ఎగురవేశారు. కార్యకర్తలు చేసిన తప్పిదం నేపథ్యంలో... పల్నాడు జిల్లాలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. జెండాను కట్టేటప్పుడు తలకిందులుగా కార్యకర్తలు కట్టగా... అది తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఎగరవేశారు. ఈ నేపథ్యంలోనే... తలకిందులుగా ఎగురవేసిన వైసీపీ జెండా వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియో వైరల్ కావడంతో తెలుగు దేశం ( TDP) సోషల్ మీడియా.. వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఒక ఆట ఆడుకుంటుంది. వైసీపీ కి 11 స్థానాలు రావడంతో... ఏపీలో ఆ పార్టీ పరిస్థితి తలకిందులు అయిందని పోస్టులు పెడుతున్నారు. అందుకే వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ జెండాను తలకిందులుగా ఎగురవేశారని సెటైర్లు పేల్చుతున్నారు. పార్టీ పరిస్థితిపై పల్నాడు వేదికగా జగన్మోహన్ రెడ్డి హింట్ ఇచ్చాడని... ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు.
అయితే టిడిపి సోషల్ మీడియాకు అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా కూడా కౌంటర్ ఇస్తోంది. పల్నాడు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి కోసం వేలాది సంఖ్యలో జనాలు వచ్చారని... అది మాత్రం టిడిపి సోషల్ మీడియాకు కనిపించడం లేదని ఫైర్ అవుతున్నారు. కేవలం జెండా వీడియోను మాత్రమే వైరల్ చేస్తున్నారని.. జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వచ్చిన జనాల గురించి టిడిపి మాట్లాడడం లేదని కౌంటర్ ఇస్తున్నారు.
Twitter Link
వైసీపీ జెండా తలకిందులుగా ఎగరేసిన జగన్ !!
— Telugu360 (@Telugu360) June 18, 2025
పార్టీ పరిస్థితిపై పల్నాడు వేదికగా హింట్ ఇచ్చాడా?#YSJagan pic.twitter.com/duwVepxqDa






