సంక్షేమంపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు

by Thanuru Gopichand |

స్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను పీల్చి పిప్పిచేసి వారి సబ్‌ప్లాన్ నిధులను మళ్లించి జేబులు నింపుకున్న జగన్‌రెడ్డికి సంక్షేమంపై మాట్లాడే అర్హత లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు.

సంక్షేమంపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను పీల్చి పిప్పిచేసి వారి సబ్‌ప్లాన్ నిధులను మళ్లించి జేబులు నింపుకున్న జగన్‌రెడ్డికి సంక్షేమంపై మాట్లాడే అర్హత లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఇవాళ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మోసం గురించి జగన్ చెప్తుంటే ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఫక్కున నవ్వుతున్నారని సెటైర్ వేశారు. తన ఐదేళ్ల పాలనలో జగన్ చేసిన మోసాలను భరించలేకే జనం వేసిన మొట్టికాయకులకు ఇంకా వాపులు తగ్గలేదని చురకలు అంటించారు. ఏపీ బ్రాండ్‌ను చంద్రబాబు, లోకేశ్ పునఃనిర్మిస్తుండగా.. మరోవైపు జగన్ అలవాటు ప్రకారం అమరావతిపై విషం కక్కుతున్నారని ఆరోపించారు. సీఎంగా ఉన్నప్పుడు కనీసం ఎమ్మెల్యేలను కలవని జగన్.. ఇప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటానంటే అది నమ్మే స్థితి లేకే పార్టీ మారుతున్నారని చెప్పారు.

Next Story