- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆ అంశం పై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు’.. వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై ఎన్డీయే కూటమి ప్రభుత్వం అసెంబ్లీ(AP Assembly) వేదికగా చెబుతున్నవి పచ్చి అబద్ధాలు అని ఏపీ పీసీసీ చీఫ్(APPCC) వైఎస్ షర్మిల(YS Sharmila) ఆరోపించారు.

దిశ,వెబ్‌డెస్క్: పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై ఎన్డీయే కూటమి ప్రభుత్వం అసెంబ్లీ(AP Assembly) వేదికగా చెబుతున్నవి పచ్చి అబద్ధాలు అని ఏపీ పీసీసీ చీఫ్(APPCC) వైఎస్ షర్మిల(YS Sharmila) ఆరోపించారు. మసి పూసి మారేడు కాయ చేసినట్లు వాస్తవాలను దాచి పెడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్ర జీవనాడి అయిన ప్రాజెక్టులో జీవం తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 41.15 మీటర్ల ఎత్తు, రూ.30,436 కోట్ల బడ్జెట్ అంచనాలకు కేంద్రం ఆమోద ముద్ర వేస్తే.. 45.72 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు కడతామని కూటమి ప్రభుత్వం(AP Government) చెబుతున్నవి అబద్ధాలు కాదా? అని ఆమె ప్రశ్నించారు. ఎత్తు తగ్గింపు విషయం అవాస్తవం అయితే దీనిపై కేంద్రంతో ప్రకటన చేయించాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ(Congress) పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం పై వైఎస్ షర్మిల(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్రలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) భాగస్వామి అయితే... కర్త, కర్మ, క్రియ మాజీ సీఎం జగనే(Former CM Jagan) అని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు(Polavaram Project)పై మాట్లాడే నైతిక అర్హత వైసీపీ(YCP)కి లేదని ఆమె తేల్చి చెప్పారు. ఐదేళ్లు అధికారం ఇస్తే గాడిదలు కాశారా? ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు కుదించే ప్రతిపాదనకు ఒప్పుకున్నది మీరు కాదా? అని వైఎస్ షర్మిల నిలదీశారు.
నాడు ప్రధాని మోడీకి రాసిన లేఖల్లోనూ 41.15 మీటర్లకు నిధులు విడుదల చేయాలని కోరింది మీరు కాదా? అని ప్రశ్నించారు. వరదలకు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి మీ అనాలోచిత నిర్ణయాలే కారణం అని .. పోలవరం అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా ? అని ఆమె ఫైర్ అయ్యారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేశారు. కుడి, ఎడమ కాలువల సామర్థ్యాన్ని తగ్గించి మహానేత ఆశయాలకు తూట్లు పొడిచారని వైఎస్ షర్మిల విమర్శించారు.






