- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్‌కు తప్పులు సరిదిద్దుకునే చాన్స్ ఉండేది.. మంత్రి టీజీ భరత్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతి (Amaravati) పున:నిర్మాణ పనులను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ఘనంగా ప్రారంభించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతి (Amaravati) పున:నిర్మాణ పనులను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం కల్యాణ్(Pawan Kalyan), కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి (Amaravati)లో మొత్తం రూ.58 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) శంకుస్థాపన చేశారు. ఇందులో మొత్తం 18 ప్రాజెక్టులు ఉన్నాయి. మరోవైపు రాజధాని పునఃనిర్మాణ వేడుకకు అమరావతి ప్రాంత రైతులతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. అమరావతి పున:నిర్మాణ మహోత్సవానికి హాజరు కావాలంటూ కూటమి సర్కార్ రాష్ట్రంలోన ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ సీఎంకు జగన్‌కు ఆహ్వానం పంపారు. కానీ, ఆయన గురువారం సాయంత్రమే బెంగళూరుకు వెళ్లిపోయారు.
ఈ క్రమంలోనే మంత్రి టీజీ భరత్ (Minister TG Bharat) కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని పరిధిలో ప్రధాని శంకుస్థాపన చేసిన అన్ని అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతపదికన మొదలవుతాయని అన్నారు. రాజధాని పనులకు సంబంధిచించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా ముగిసిందని అన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా.. ప్రధాని మోడీ హాజరైన సభకు వైఎస్ జగన్ (YS Jagan) వచ్చి ఉంటే బాగుండేదని అన్నారు. అమరావతి పునర్నిర్మాణంలో ఆయన కూడా భాగస్వాములయ్యే వారని కామెంట్ చేశారు. రాజధాని విషయంలో జగన్ గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకునే చాన్స్ ఉండేదని మంత్రి టీజీ భరత్ తెలిపారు.






