- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirupati Incident: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై జగన్ తీవ్ర విమర్శలు
తిరుపతి తొక్కిసలాట ఘటన(Tirupati Incident)పై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(Jagan) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి తొక్కిసలాట ఘటన(Tirupati Incident)పై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(Jagan) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై తీవ్ర విమర్శలు చేశారు. ‘సీఎం గారేమో తొక్కిసలాట ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని, దాన్నే పెద్ద దండనగా చిత్రీకరిస్తుంటే, మరోవైపు డిప్యూటీ సీఎం గారేమో క్షమాపణ చెప్పాలంటూ మరో రాజకీయ డ్రామాకు తెరలేపారు’ అని ఎద్దేవా చేశారు.
ఈ ఘటనలో సీఎం చంద్రబాబుతో పాటు టీటీడీ చైర్మన్(TTD Chairman), ఈవో, అదనపు ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీల నిర్లక్ష్యం ఉందని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు పోలీసులందరినీ తన కుప్పం పర్యటనలో పెట్టుకున్నారని ఆరోపించారు. ఆరుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారని.. క్షమాపణ చెబితే సరిపోతుందా..? అని ప్రశ్నించారు. ఇకనైనా సీఎం, డిప్యూటీ సీఎం చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ తొక్కిసలాటకు ప్రత్యక్షంగా బాధ్యులైన టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






