- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ ఏడుపులే మాకు దీవెనలు..జగన్‌కు లోకేష్ కౌంటర్
రాష్ట్రంలో విద్యావ్యవస్థ నాశనం అయ్యింది అంటూ మాజీ సీఎం జగన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఏపీఈసెట్ అడ్మిషన్లే దానికి పెద్ద ఉదాహరణ అని,

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో విద్యావ్యవస్థ నాశనం అయ్యింది అంటూ మాజీ సీఎం జగన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఏపీఈసెట్ అడ్మిషన్లే దానికి పెద్ద ఉదాహరణ అని, రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదని విమర్శించారు. కాగా జగన్ ట్వీట్‌కు మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. జగన్ మీ ఏడుపులే మా దీవెనలు అని పేర్కొన్నారు. ఐదేళ్లు మీరు విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి పోయారని, తాను ఏడాదిలోనే అనేక సంస్కరణలు తీసుకువచ్చానని అన్నారు. విద్యావ్యవస్థను గాడిన పెట్టడం చూసి మీకు కడుపు మండటం సహజం అని పేర్కొన్నారు. మీ హయాంలో ఎప్పుడు కౌన్సిలింగ్ పెట్టారో కూడా స్పృహ లేదని విమర్శించారు. కోవిడ్ తరవాత మీరు 2022 సెప్టెంబర్లో, 2023 జూలై చివరికి ఈసెట్ కౌన్సిలింగ్ పూర్తి చేసిన మీరు మమ్మల్ని విమర్శించడం మీ అజ్ఞానానికి నిదర్శనం అన్నారు. మేము ప్రభుత్వంలోకి రాగానే ఈసెట్ మొదటి కౌన్సిలింగ్‌ను జూలై మూడో వారానికి పూర్తి చేస్తామన్నారు.






