కంప్లైంట్ తీసుకోవడం సంగతి దేవుడెరుగు.. తిరిగి బాధితులపై కేసులు పెట్టడమేంటి?.. సర్కార్‌పై జగన్ ఫైర్

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-18 12:41:06  IST  )

తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో జేమ్స్(James) అనే దళిత విద్యార్థిపై దాడి జరిగిన విషయం తెలిసిందే.

కంప్లైంట్ తీసుకోవడం సంగతి దేవుడెరుగు.. తిరిగి బాధితులపై కేసులు పెట్టడమేంటి?.. సర్కార్‌పై జగన్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో జేమ్స్(James) అనే దళిత విద్యార్థిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. స్వయంగా అదే కాలేజీకి కొందరు విద్యార్థులు అతికిరాతకంగా దాడి చేశారు. జేమ్స్‌ను తిరుచానూరు సమీపంలోని ఓ లాడ్జిలోకి తీసుకెళ్లి చేతులు, కాళ్లు కట్టేసి చిత్రహింసలకు గురిచేశారు. ముఖంపై మూత్రం పోశారు. కత్తితో పొడవడానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై తిరుచానూరు పోలీస్ స్టేషన్‌(Tiruchanoor Police Station)లో జేమ్స్ కంప్లైంట్ చేశారు. తాజాగా ఈ ఘటనపై వైసీపీ(YCP) అధినేత, మాజీ సీఎం జగన్(Jagan) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.

‘దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ. దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. సీఎం చంద్రబాబు, అధికార పార్టీ నాయకుల డైరెక్షన్‌లో పోలీసులు పనిచేస్తున్నారు. బాధితులకు రక్షణ కల్పించకపోగా.. పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి దాడులు ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట దళితులపైన జరుగుతూనే ఉన్నాయి. పోలీస్‌స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోవడమే కాదు, ఫిర్యాదు దారులమీదే ఎదురు కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. జేమ్స్‌పై దాడి ఘటనలో పోలీసు యంత్రాంగం వైఫల్యమే కాదు, రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదును కూడా స్వీకరించలేని పరిస్థితి. తిరుపతి ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాను’ అని ట్వీట్‌లో జగన్ పేర్కొన్నారు.

Next Story