- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.10 ఇచ్చి రూ.100 దోచుకునే నైజం జగన్‌ది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రూ.10 ఇచ్చి రూ.100 దోచుకునే నైజం జగన్‌ది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రూ.10 ఇచ్చి రూ.100 దోచుకునే నైజం జగన్‌ది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో బాగుపడింది కేవలం నలుగురు రెడ్లేనని వారు పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల వల్ల బాగుపడింది జగన్ కంపెనీలేనని ఆరోపించారు. రాష్ట్రంలో బీసీలను పూర్తిగా అనగదొక్కారని, వారికి పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందన్నారు. గతంలో బీసీ చెంతకు వచ్చే ధైర్యం చేయకూడదనే బీసీ రక్షణ చట్టం పెట్టామని తెలిపారు. జగన్ బట్టన్ నొక్కుడు మాత్రమే చెబుతున్నాడని, బొక్కుడు చెప్పట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ భవనాలు పూర్తి చేయలేని ప్రభుత్వం మూడు రాజధానులను కడతాడంటా అంటూ ఎద్దేవా చేశారు.
Next Story






