వైఎస్ జగన్, అల్లు అర్జున్ మాస్క్‌లు వేసుకొని ర‌చ్చ !

by velandi.Saikiran |   (  Updated:2025-12-31 20:11:31  IST  )

జల్సా రీ-రిలీజ్ నేప‌థ్యంలో జనసైనికులు రెచ్చిపోయారు. జగన్, అల్లు అర్జున్ మాస్క్‌లు వేసుకొని వెకిలి చేష్టలు చేశారు.

వైఎస్ జగన్, అల్లు అర్జున్ మాస్క్‌లు వేసుకొని ర‌చ్చ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఏపీలో రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతాయన్న సంగతి తెలిసిందే. ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్త అయినా సరే, తమ నాయకుడికి అవమానం జరిగితే అస్సలు ఊరుకోడు. ఇక తమ నాయకుడి జోలికి వస్తే ఎవరిని వదలరు. ప్రాణాలైనా ఇస్తారు. అయితే లేటెస్ట్ గా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన అరాచకం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి, అల్లు అర్జున్ మాస్కులు వేసుకొని ఇద్దరూ జనసేన పార్టీ జెండా పట్టుకున్నట్లు వెకిలి చేష్టలు చేశారు.

తాజాగా జల్సా సినిమా రీ-రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో థియేటర్ లో జనసైనికులు కాస్త ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇందులో భాగంగానే వైయస్ జగన్మోహన్ రెడ్డి, అల్లు అర్జున్ మాస్కులు వేసుకుని, చాలా ఓవర్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. అయితే దీనిపై వైసీపీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దానికి కౌంటర్ ఇస్తూ పోస్టులు కూడా పెడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు కాకుండా వైసిపి పార్టీకి అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి నుంచి అల్లు అర్జున్ ను టార్గెట్ చేసి పోస్టులు పెడుతున్నారు జనసేన అభిమానులు. క్లిక్

Next Story