- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నందిగం సురేశ్‌తో ప్రాణ హాని.. వ్యక్తి సెల్ఫీ వీడియో వైరల్
by Vemula.Srinu Prasad |
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌తో ప్రాణ హాని ఉందంటూ రాజధాని ప్రాంతానికి చెందిన జగదీశ్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ...

X
దివ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్(Ycp Former Mp Nandigam Suresh)తో ప్రాణ హాని ఉందంటూ రాజధాని ప్రాంతానికి చెందిన జగదీశ్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. 2019 ఎన్నికల సమయంలో నందిగం సురేశ్ తన నుంచి డబ్బులు తీసుకున్నారని, అవి అడుగుతుంటే బెదిరింపులకు దిగుతున్నారని ఆయన తెలిపారు. సురేశ్ అనుచరులు తనపై దాడులు చేసేందుకు యత్నిస్తున్నారని, తన కోసం కార్లతో తిరుగుతున్నారని ఆరోపించారు. తనపై భౌతికదాడులు జరిగినా, చనిపోయినా ఈ సెల్ఫీ వీడియోను పోలీసులు వాంగ్మూలంగా స్వీకరించాలని కోరారు. తనతో పాటు తన కుటుంబానికి సైతం నందిగం సురేశ్ దంపతులతో ప్రాణ హాని ఉందని, రక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం, పోలీసులు స్పందించాలని జగదీశ్ కోరారు.
Next Story






