- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రితో డ్యాన్స్ చేసింది నేనే.. జగన్‌కు జబర్దస్త్ శాంతి స్వరూప్ కౌంటర్
ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇటీవల మంత్రి వాసంశెట్టి సుభాష్ పై విమర్శలు కురిపించారు. మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. మంత్రి వాసంశెట్టి సుభాష్ స్టేజిపై అశ్లీల నృత్యాలు చేశాడని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇటీవల మంత్రి వాసంశెట్టి సుభాష్ పై విమర్శలు కురిపించారు. మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. మంత్రి వాసంశెట్టి సుభాష్ స్టేజిపై అశ్లీల నృత్యాలు చేశాడని అన్నారు. రాష్ట్రంలో మహిళలపై దారుణాలు జరుగుతున్నాయంటూ పలువురు నాయకులను జగన్ విమర్శించారు. అయితే తాజాగా జగన్ వ్యాఖ్యలపై జబర్దస్త్ ఆర్టిస్ట్ శాంతి స్వరూప్ స్పందించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ తో డ్యాన్స్ చేసింది తానేనని చెప్పారు. డ్యాన్స్ చేసింది అమ్మాయి కాదని అది తానేనని అన్నారు. వైసీపీ వాళ్లకు సంబంధించిన షో లలో కూడా తాను చేశానని అన్నాడు. మీకు తెలియకపోయినా మీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు నేను తెలిసే ఉంటానని కనీసం వాళ్లను అడిగి అయినా మాట్లాడాల్సింది అంటూ శాంతి స్వరూప్ వ్యాఖ్యానించారు.
సంక్రాంతి సంబరాలకు మంత్రి వాసంశెట్టి సుభాష్ ..హైపర్ ఆది టీమ్ ను పిలిస్తే తాము వెళ్లామని అన్నారు. వెళ్లిన తరవాత ప్రజలను ఎంటర్టైన్ చేయాలని కాబట్టి వెళ్లామని అన్నారు. మంత్రి వచ్చి తమతో డ్యాన్స్ చేయలేదని తానే వెళ్లి ఆయనను బలవంతం చేశామని చెప్పారు. మీరు ఇలా ప్రచారం చేస్తే కళాకారులకు అవకాశాలు రాకుండా పోతాయని అన్నారు. సంక్రాంతి సంబరాల కార్యక్రమం ఎంతో సక్సెస్ అయ్యిందని అది ఓర్వలేక మీ వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మాట్లాడేటప్పుడు ఒకటి రెండు సార్లు చూసుకోవాలన్నారు. తాము చేసింది రికార్డింగ్ డ్యాన్సులు కాదని కేవలం పద్దతిగా చేశామన్నారు. ఇంతకంటే దారుణంగా మీ పార్టీవాళ్లు చేసిన వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయని చెప్పారు.






