‘అక్కడ నా బర్త్ డే వేడుకలు నిర్వహించడం బాధాకరం’.. మంత్రి లోకేష్ ఎమోషనల్ కామెంట్స్!

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేష్(Minister Nara Lokesh), సీఎం చంద్రబాబు(CM Chandrababu) దావోస్(Davos) లో పర్యటించిన విషయం తెలిసిందే.

‘అక్కడ నా బర్త్ డే వేడుకలు నిర్వహించడం బాధాకరం’.. మంత్రి లోకేష్ ఎమోషనల్ కామెంట్స్!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేష్(Minister Nara Lokesh), సీఎం చంద్రబాబు(CM Chandrababu) దావోస్(Davos) లో పర్యటించిన విషయం తెలిసిందే. నిన్న(జనవరి 23) మంత్రి లోకేష్ బర్త్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. సినీ, రాజకీయ ప్రముఖులు నారా లోకేష్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు. అయితే.. ఓ ప్రభుత్వ హైస్కూల్లో(High School) తన జన్మదిన వేడుకలు నిర్వహించడం పట్ల మంత్రి లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలోని పాఠశాలలు, విశ్వ విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. ‘‘ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జడ్పీ హైస్కూల్ లో విద్యార్థులతో నా బర్త్ డే వేడుకలు నిర్వహించినట్లు వచ్చిన వార్త నన్ను మనస్థాపానికి గురి చేసింది. ఇందుకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని వారిని కోరుతున్నాను’’ అని మంత్రి లోకేష్ ప్రకటనలో పేర్కొన్నారు.

Next Story