- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘వైఎస్ జగన్ పోలీసులను అలా అనడం బాగోలేదు’: YS Sharmila
గత వైసీపీ ప్రభుత్వం పై ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ,వెబ్‌డెస్క్: గత వైసీపీ ప్రభుత్వం పై ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం స్కామ్ పై విచారణ జరుగుతోందని వైఎస్ షర్మిల అన్నారు. తన తప్పు ఉంటే విచారణ చేసుకోవాలని వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారని షర్మిల గుర్తు చేసుకున్నారు. మద్యం స్కామ్ పై వైఎస్ జగన్ తన తప్పు లేదని వాదిస్తున్నారే.. కానీ విచారణ చేయాలని ఎందుకు చెప్పట్లేదని ఆమె ప్రశ్నించారు. గతంలో మద్యం కొనుగోలుకు డిజిటల్ పేమెంట్లు లేవని మాజీ సీఎం జగన్ చెబుతున్నారు. కానీ.. నగదు చెల్లింపులతో భారీ అవినీతి జరిగిందని తెలుస్తోందని వైఎస్ షర్మిల ఆరోపించారు
పోలీసులను తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Former CM YS Jagan) పోలీసుల బట్టలూడదీస్తామనడం బాగోలేదని ఆమె విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో పోలీసులను ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసని షర్మిల(YS Sharmila) తెలిపారు. తనకు వ్యతిరేకంగా ఉన్న నేతల వేధింపులకు పోలీసులను జగన్ వాడుకున్నారని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో రఘురామకృష్ణంరాజు సహా పలువురు నేతలను ఎలా వేధించారో తెలిసిందే అని ఆమె తెలిపారు.






