- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral: ప్రభుత్వ ఆసుపత్రిలో 'ఐటెం సాంగ్' రచ్చ.. ఇద్దరు హెడ్ నర్సుల సస్పెన్షన్
రోగులకు సేవలు అందించాల్సిన వైద్య సిబ్బంది విధులను గాలికొదిలేసి ఆసుపత్రిలోనే ఐటెం సాంగ్స్‌కు స్టెప్పులేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కలకలం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రోగులకు సేవలు అందించాల్సిన వైద్య సిబ్బంది విధులను గాలికొదిలేసి ఆసుపత్రిలోనే ఐటెం సాంగ్స్‌కు స్టెప్పులేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కలకలం రేపింది. ఆసుపత్రి క్రమశిక్షణను ఉల్లంఘించి డ్యాన్సులు చేసిన ఇద్దరు హెడ్ నర్సులపై జిల్లా యంత్రాంగం సస్పెన్షన్ వేటు వేసింది. వివరాల్లోకి వెళితే.. మహిళా దినోత్సవానికి ముందు రోజు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోని సెమినార్ హాల్‌లో కొందరు నర్సింగ్ సిబ్బంది విధుల్లో ఉండగానే ఓ ఐటెం సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చే రోగులను పట్టించుకోకుండా, విధి నిర్వహణ సమయంలో ఇలా సినిమా పాటలకు చిందులు వేయడంపై ప్రజలు, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
అధికారుల సీరియస్ యాక్షన్..
ఈ ఘటనను వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా సమగ్ర విచారణ చేపట్టారు. విచారణ నివేదికను పరిశీలించిన అనంతరం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కఠిన చర్యలకు ఆదేశించారు. విధుల్లో ఉండి డ్యాన్స్‌లు చేసిన హెడ్ నర్సులు మెర్సీ, ఈశ్వరీలను తక్షణమే సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. డ్యాన్సులు చేయడమే కాకుండా, వారిని ప్రోత్సహించిన మరో 12 మంది నర్సులకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, ఆసుపత్రిలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.






