‘దేశంలోనే మొదటి సారిగా ఆ నిర్ణయం తీసుకుంది నేనే’.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

‘థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ’ అనేది తమ నినాదమని ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) తెలిపారు.

‘దేశంలోనే మొదటి సారిగా ఆ నిర్ణయం తీసుకుంది నేనే’.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ‘థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ’ అనేది తమ నినాదమని ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) తెలిపారు. ప్రపంచంలోని గొప్ప కంపెనీలన్నీ దావోస్‌కు(Dawos) వస్తుంటాయి. అక్కడికి వెళ్లడం వల్ల ప్రతినిధులను కలిసే అవకాశం వస్తుందన్నారు. దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఏపీ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఒకప్పుడు IT గురించి మాట్లాడే వాళ్లం.. కానీ ఇప్పుడు ఏఐ(AI) గురించి మాట్లాడుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.

ప్రజెంట్ ప్రపంచమంతా AI ఎంత అభివృద్ధి చెందిందో చూస్తునే ఉన్నాం. దేశంలో మొదటి సారి దావోస్ వెళ్లాలని నిర్ణయించింది తానేనని చంద్రబాబు తెలిపారు. 1997 నుంచి అక్కడికి వెళ్తున్నట్లు చెప్పానని గుర్తు చేశారు. ఈ క్రమంలో ‘‘మనం జాబ్(Job) అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలి. సాధారణ వ్యక్తులను అసాధరణ వ్యక్తులుగా తయారుచేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మనవాళ్లు గొప్ప స్థాయిలో ఉన్నారు. ధ్వంసమైన ఏపీ బ్రాండ్‌ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నాం. 2028 నుంచి జీడీపీ వృద్ధి రేటులో చైనాను అధిగమిస్తాం’’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Next Story