టీడీపీ బిగ్ స్కెచ్.. కదలబోతున్న మరో పీఠం..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-23 09:57:43  IST  )

మరో పీఠాన్ని కైవసం చేసుకునే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది...

టీడీపీ బిగ్ స్కెచ్.. కదలబోతున్న మరో పీఠం..!
X

దిశ, వెబ్ డెస్క్: మరో పీఠాన్ని కైవసం చేసుకునే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ హయాంలో ఎలాగైతే వన్ సైడ్‌గా వ్యవహరించారో అదే వ్యూహంతో అధికార పార్టీ ముందుకు వెళ్తోంది. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ క్వీన్ స్వీప్ చేసిన మేయర్ పీఠాలపై టీడీపీ దృష్టి సారించింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు మేయర్ పీఠాలను కైవసం చేసుకుంది. ఇప్పుడు నెల్లూరు మేయర్ పదవిపై ఫోకస్ పెట్టింది. 2021 కార్పొరేషన్ ఎన్నిక‌ల్లో 54 స్థానాలను వైసీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. మేయర్‌గా ఆ పార్టీ కార్పొరేటర్ స్రవంతి బాధ్యతలు చేపట్టారు.

అయితే సోమవారంతో ఆమె పాలనకు నాలుగేళ్లు పూర్తి అవుతోంది. దీంతో స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. వైసీపీ గెలిచిన 54 స్థానాల్లో 43 మంది కార్పొరేటర్లు టీడీపీకి మద్దతిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ పీఠాన్ని సైతం దక్కించేందుకు అధికార పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు కసరత్తులు చేస్తున్నారు. త్వరలోనే నెల్లూరు పీఠాన్ని దక్కించుకుంటామని దీమాగా చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Next Story