- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపల్లెకా.. ఇంటికా..?: కన్య్ఫూజన్‌లో రజిని రాజకీయం?
విడదల రజని రాజకీయ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నట్లు తెలుస్తోంది...

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ మాజీ మంత్రి విడదల రజని(Former YSRCP minister Rajani resigns) రాజకీయ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయని ఆ పార్టీకి చెందిన ముఖ్యులు భావిస్తున్నారు. జగన్ పాలన సమయంలో చిలకలూరిపేట(Chilakaluripet) నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, ఆ తరువాత రాష్ట్ర మంత్రిగా రజని హవా నడిపించారు. మర్రి రాజశేఖర్ లాంటి రాజకీయ సీనియర్‌ను ఖాతరు చేయకుండా ఆయన అనుచరగణాన్ని ఇబ్బందుల పాలు చేశారు. ఆ రోజు సొంత పార్టీ ఎంపీగా నిజాయితీపరుడిగా పేరుబడ్డ లావు శ్రీకృష్ణ దేవరాయలు పట్ల కూడా లెక్కలేనితనంతో వ్యవహరించారు. అంతటి హవా నడిపిన రజని 2024 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గుంటూరు పచ్చిమకు మారి పోటీ చేసి ఓటమి చవి చూశారు. సొంత నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకొని గుంటూరుకు మారి అక్కడ కూటమి వేవ్‌లో ఓడి పోయారు. దీంతో ఉన్నది, ఉంచుకున్నది పోయినట్టుగా
రజని రాజకీయ పరిస్తితి తయారయ్యింది. ఆ తరువాత తిరిగి ఆమె చిలకలూరిపేట వైసీపీ ఇంచార్జిగా వెనక్కు వచ్చారు. కానీ చిలకలూరిపేటలో పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న శ్రీ కృష్ణ దేవరాయలు ప్రస్తుతం టీడీపీ ఎంపీ పార్లమెంటులోని అన్ని నియోజకవర్గాల్లో పట్టుసాధిస్తూ తన ఇమేజ్‌ను ఇనుమడింప చేసుకుంటున్నారు.
ఇక చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ అటు రజని, ఇటు ఆ పార్టీ అధిష్టానం వ్యవహరిచిన తేరుతో ఆయన సైకిల్ ఎక్కి టీడీపీలో చేరి పోయారు. దీంతో నియోజకవర్గంలో వైసీపీ పునాదులు కదిలిపోయాయి. రజని వెనక్కువచ్చినా ఇక్కడి పరిస్తితులు గమనిస్తే పార్టీ పుంజుకునే వాతావరణం కనిపించలేదు. ఈ విషయంపై రజని, ఆమె అనుచరులు గమనించింది తెలియదు కానీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్పష్టం అయింది. అందువల్ల ఆయన రజనిని ఇక్కడ నుంచి తప్పించే ఆలోచన చేశారని పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు.
ప్రస్తుత రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న రేపల్లె వైసిపి ఇంచార్జిగా మారాలని ఆదేశించినట్టు తెలిసింది. ఈ నిర్ణయం రజనిని తీవ్ర నిరాశకు గురి చేసిందంటున్నారు. రేపల్లె లో మంత్రి సత్యప్రసాద్ మంత్రిగా, బీసీ నాయకుడిగా బలంగా ఉన్నారు. పైగా ఆ నియోజకవర్గంలో పట్టున్న మాజీ మంత్రి, మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ రావు పదవికి, పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. కొత్త నియోజకవర్గం, అక్కడి పరిస్థితులు ఆమెకు కాలి వచ్చేలా లేవు అన్న అభిప్రాయంతో ఉన్నట్టు తెలిసింది. పైగా రజని అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని లెక్కచేయకుండా వ్యవహరించి క్యాడర్‌ను, ముఖ్య నాయకులను దూరం చేసుకుందన్న అభిప్రాయం జగన్‌కు ఏర్పడిందని అందుకే రజని ప్రాధాన్యత పార్టీలో అంతంత మాత్రంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ పరిణామాలతో రాజకీయాల్లో రజని ఉత్సాహంగా ఉందా లేకపోతున్నారు. పూర్వం జరిగిన తప్పిదాలకు కేసులు వెంటాడుతున్నాయి. దీంతో రజని శిబిరం నిరాశలో కొట్టుమిట్టాడుతున్నట్టు సమాచారం. అలా కాకుండా కూటమి పార్టీలో చేరుతామంటే అక్కడ ఛాన్స్ దొరికే పరిస్తితి లేదు. వైసీపీలో కొనసాగుదా మంటే ఎక్కడ కుదురుగా నిలబడనివ్వడం లేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు వచ్చింది గొడవ అంటూ ఈ పరిణామాలతో రజని రాజకీయాలలో స్లో అవుతున్నట్టు సమాచారం.
గొప్ప అదృష్టం...
ఒక విధంగా చెప్పాలంటే సరైన టైంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి అదృష్టం దక్కించుకున్నారు రజని. 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎక్కడో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా ఉంటూ టిడిపిలోకి ప్రవేశించారు. అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అనుచరురాలుగా కొనసాగారు. కానీ తెలుగుదేశం పార్టీలో ఉంటే ఎదుగుదల ఉండదని భావించారు. జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలా చేరిన మరుక్షణం టికెట్ దక్కించుకున్నారు. పోటీ చేసిన తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఏకంగా మంత్రి అయ్యారు. పవర్ పాలిటిక్స్ రుచి చూశారు. సరికొత్తగా రాజకీయాలు చేసుకుంటూ ముందుకు సాగారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆమెను కుదురుగా కూర్చోనివ్వడం లేదు.. నిలకడగా నిలబడనివ్వడం లేదు. ఆమె మాత్రం చిలకలూరిపేటని విడిచిపెట్టి వెళ్లేందుకు సుముఖంగా లేరని ఆమె వర్గీయులు చెబుతున్నారు. అయితే అధిష్టానం వెళ్లాల్సిందేనని పట్టుబడుతుండడంతో రజనీ పొలిటికల్‌గా కన్ఫ్యజన్ అవుతున్నట్టు తెలుస్తోంది.
చివరకు మిగిలింది ఆ రెండు పార్టీలు...
తమరు నాటిన సైబరాబాద్ మొక్కను అంటూ ఆ రోజుల్లో చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు రజని. తమరు ఇచ్చిన రాజకీయ జీవితం అంటూ మొసలి కన్నీరు కార్చారు జగన్మోహన్ రెడ్డి విషయంలో. అంటే తెలుగుదేశం పార్టీతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆప్షన్‌ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఆమె ముందున్న ఆప్షన్ జనసేన. అంతకుమించి ఆలోచన చేస్తే బిజెపి. ఆ రెండు పార్టీల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదని తెలుస్తోంది. దీంతో పొలిటికల్‌గా సైలెంట్ కావడమే ఉత్తమమని రజనీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో..?.






