లిక్కర్ కేసులో సంచలనం.. నగదు లావాదేవీలపై నోరు విప్పిన రాజ్ కసిరెడ్డి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-28 16:44:39  IST  )

లిక్కర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది....

లిక్కర్ కేసులో సంచలనం.. నగదు లావాదేవీలపై నోరు విప్పిన రాజ్ కసిరెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ కేసు(Liquor Case)లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. నగదు లావాదేవీలపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ(ED) అధికారులు నిందితుడు రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy) నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. జైలులో ఉన్న కసిరెడ్డిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఇద్దరు అధికారులు ప్రశ్నించారు. మద్యం కేసులో నగదు అక్రమ లావాదేవీలపై సుమారు 100 ప్రశ్నలు సంధించారు. అలాగే స్టేట్ మెంట్ రికార్డు చేసినట్లు సమాచారం. నెట్ వర్క్‌ల ద్వారా కమీషన్ రూపంలో వసూలు చేసినట్లు గుర్తించిన ఈడీ అధికారులు.. ‘నగదు ఏఏ సంస్థలు, రంగాల్లో పెట్టుబడులు, వినియోగించిన ఖతాలు, నగదు అక్రమ రవాణా, ఎన్ని చోట్ల ఆస్తులు కొన్నారు. చివరి లబ్ధిదారుడికి నగదు ఎలా అందజేశారు.?.’ అనే కోణంలో ప్రశ్నించారు. ఆయన చెప్పిన అన్ని సమాధానాలను రికార్డు చేశారు. విచారణ అనంతరం జైలు నుంచి ఈడీ అధికారులు వెళ్లిపోయారు.

Next Story