- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cm Chandrababu: అప్పుడూ... ఇప్పుడు అదే రూటు.. గమనించారా...?
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు అంటే యువతకు ఉపాధి అని అంటారు..

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు (Cm Chandrababu Naidu) అంటే యువతకు ఉపాధి అని అంటారు. నిజమే ఆయన గతంలోనే అలానే పని చేశారు. తొలిసారి ముఖ్యమంత్రి అయిన సమయంలో ఐటీ(IT)కి ప్రాధాన్యత ఇచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించారు. అటు నిరుద్యోగులకు కూడా పెద్ద పీట వేశారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఏపీ ప్రజలకు సేవలు అందిస్తున్న ఆయన.. ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు సీఎంగా కొనసాగారు. వేల సంఖ్యలో పోలీస్(Police), ఉపాధ్యాయ(Teachers) పోస్టులను భర్తీ చేశారు. ఇలా మొత్తం 11 సార్లు డీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చి 1,80,208 మందికి ఉపాధ్యాయ పోస్టులు కల్పించారు. ఇప్పుడున్న టీచర్లలో ఎక్కువమంది చంద్రబాబు హయాంలో పోస్టులు పొందినవారే.
అయితే 2019-2024 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ డీఎస్సీ నిర్వహిస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. అధికారం వచ్చిన తర్వాత జంబో డీఎస్సీ, మెగా డీఎస్సీ అంటూ 5 ఏళ్ల పాటు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారు. 2024 ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు 6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ 30 రోజుల్లోనే పరీక్షలంటూ మెలిక పెట్టారు. 5 ఏళ్ల హయంలో ఒక్కటంటే ఒక్క డీఎస్సీ విడుదల చేయని జగన్ మోహన్ రెడ్డి.. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ కలిపి ఇచ్చి అభ్యర్థుల్లో అయోమయం సృష్టించారు. అంతేకాకుండా ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల ముందు కాపలా పెట్టించి వారికి అవమానించారు. అప్రెంటీస్ విధానం ద్వారా రెండేళ్ల పాటు జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) ఉపాధ్యాయుల పొట్టకొట్టారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు.. ఉపాధ్యాయులకు గౌరవిస్తూ వారికి అండగా ఉంటున్నారు. బీఎడ్ చదివి, టెట్ అర్హత సాధించి ఉప్యాధాయ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారు. పెద్ద మనసుతో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. నిరుద్యోగులు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. అయితే చంద్రబాబు.. జగన్ హయాంలో రాష్ట్రంలో ఏం జరిగిందనేది ప్రజానికం గమనించాలని, ఇప్పటికైనా ఎవరు ఏంటి అనేది అర్ధం చేసుకోవాలని తెలుగుదేశ పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు కోరుతున్నారు.






