మూడు రోజులుగా నిలిచిపోయిన ఎన్టీఆర్ వైద్య సేవలు.. డిమాండ్స్ ఇవే..

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-12 08:31:50  IST  )

రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయి మూడు రోజులు అవుతోంది...

మూడు రోజులుగా నిలిచిపోయిన ఎన్టీఆర్ వైద్య సేవలు..  డిమాండ్స్ ఇవే..
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవలు(Ntr Health Services) నిలిచిపోయి మూడు రోజులు అవుతోంది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రైవేటు స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ప్రభుత్వ వైద్య సేవలు కొనసాగించారు. దీంతో ఆస్పత్రులకు ప్రభుత్వం భారీగా బకాయిలు ఉంది. అయితే ఈ బకాయిలు చెల్లించాలని కొన్ని రోజులుగా ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వ వైద్య సేవలు అందించలేని పరిస్థితిలో ఉన్నామని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఆయా ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేశారు. ఎమర్జెన్సీ సమయంలో రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. అయితే ఎన్టీఆర్ వైద్య సేవలు అందించడంలేదని వైద్యులు చెప్పడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్ల లేక ప్రైవేటు ఆస్పత్రుల్లో బిల్లులు కట్టలేక రోగులు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం స్పందించి త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Next Story