- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: పరకామణి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
పరకామణి చోరీ కేసు ఫిర్యాదు దారుడు సతీశ్ కుమార్ హత్యకు గురైనట్లు ప్రాథమిక నిర్ధారణ అయింది...

దిశ, వెబ్ డెస్క్: పరకామణి చోరీ కేసు ఫిర్యాదు దారుడు సతీశ్ కుమార్ హత్యకు గురైనట్లు ప్రాథమిక నిర్ధారణ అయింది. అయితే ఆయన మృతదేహం రైల్వే ట్రాక్ పక్కన పడి ఉండటంతో అనుమాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో సతీశ్ కుమార్ టీటీడీలో పని చేశారు. ఆ సమయంలో పరకామణిలో చోరీ జరిగింది. ఈ వ్యవహారంపై సతీశ్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో కేసులో పెను సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సతీశ్ కుమార్‌ను సైతం పోలీసులు విచారించారు. అయితే మరింత విచారణలో కొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. గుంతకల్లులో ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్ స్పెక్టర్‌గా పని చేస్తున్న సతీశ్ కుమార్ మృతదేహం తాడిపత్రి సమీపంలో కోమలి రైల్వే ట్రాక్ పక్కన కనిపించింది. దీంతో సతీశ్ కుమార్ మృతిపై అనుమానాలు తలెత్తాయి. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. సతీశ్ కుమార్ పోస్టుమార్టంలో పలు కీలక విషయాలు ప్రాథమికంగా వెలుగులోకి వచ్చాయి. సతీశ్ తల వెనుక ఆయుధంతో నరికిన ఆనవాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ నమూనాలను ఫోరెన్సిన్ ల్యాబ్‌కు పంపారు. రిపోర్టు ఆధారంగా పోలీసులు ముందుకు వెళ్లనున్నారు.
అయితే సతీశ్ కుమార్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించినట్లు గుర్తించారు. ఆయన ప్రయాణించిన బోగీలో ఉన్న ప్రయాణికుల లిస్టును పరిశీలించారు. ఒక్కొక్కరిని విచారిస్తున్నారు. బోగీలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా..?. సతీశ్ కుమార్ ను ఫాలో చేశారా..?, అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
కాగా తిరుమల శ్రీవారి హుండీ లెక్కింపులో సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ నగదును చోరీ చేశారు. అయితే విజిలెన్స్ విభాగంలో పని చేస్తున్న సతీశ్ కుమార్ .. చోరీ చేస్తున్న రవికుమార్‌ను పట్టుకున్నారు. రవికుమార్‌పై చార్జిషీట్ ఫైల్ చేశారు. అయితే ఆ సమయంలో కేసును వైసీపీ నేతలు రాజీచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును బయటకు తీసింది. కేసును మళ్లీ విచారించాలని సీఐడీకి కోర్టు ఆదేశించింది. దీంతో రవికుమార్ కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. సడెన్‌గా సీఐ సతీశ్ కుమార్ మృతి చెందడంతో పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.






