శ్రీహరికోటలో బాహుబలి రాకెట్ ప్రయోగం.. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-02 12:02:58  IST  )

ఇస్రో(ISRO) మరో అరుదైన ఘనత సాధించింది.

శ్రీహరికోటలో బాహుబలి రాకెట్ ప్రయోగం.. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇస్రో(ISRO) మరో అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక బాహుబలి రాకెట్‌(Bahubali Rocket)ను ఆదివారం సాయంత్రం సరిగ్గా 5:26 గంటలకు నింగిలోకి ప్రవేశపెట్టింది. నిప్పులు వెదజల్లుతూ LVM3 -M5 అనే రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 4 వేల కిలోల బరువున్న శాటిలైట్‌ను తొలిసారి జియో ట్రాన్స్‌ఫర్ కక్ష్యలోకి పంపింది. భారత గడ్డపై నుంచి ప్రయోగిస్తున్న ఉపగ్రహాల్లో ఇదే అత్యంత బరువైనది కావడం విశేషం. CMS-03 కమ్యూనికేషన్ ఉపగ్రహం పది సంవత్సరాల పాటు కక్ష్యలో పరిభ్రమిస్తూ సేవలు అందించనుంది. వీడియో

Next Story