- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ISRO: మరో ప్రయోగం.. రేపటి నుంచి కౌంట్ డౌన్
మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది....

దిశ, వెబ్ డెస్క్: మరో ప్రయోగానికి ఇస్రో(Isro) సిద్ధమైంది. ఈ నెల 18న నెల్లూరు శ్రీహరికోట షార్(Nellore Sriharikota Shar) నుంచి PSLV-C61 ప్రయోగాన్ని ఆకాశంలోకి పంపనుంది. ఈ PSLV-C61ను (రీశాట్-1బీ)కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు సర్వసిద్ధం చేసింది. శనివారం ఉదయం 7:59 గంటలకు మిషన్ కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.
కాగా భారత అంతరిక్ష రంగం మరో మెట్టు ఎక్కేందుకు సిద్ధంగా ఉంది. భద్రత, వాతారవరణ సూచనలు, వ్యవసాయ పరిశీలన, భౌగోళిక సమాచారం తదితర విభిన్న అవసరాల కోసం, అత్యాధునిక ట్రెక్నాలజీతో PSLV-C61ని ఇస్రో రూపొందించింది. సరిహద్దు భద్రతకు సంబంధించి ఈ ప్రయోగం అందించే సమచారం చాలా ప్రాధాన్యత చోటు చేసుకోనుంది. భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొంటున్న పరిస్థితుల దృష్ట్యా సున్నిత పరిస్థితులు, ఉగ్రవాద కార్యకలాపాలు వంటి సమాచారాన్ని సకాలంలో సేకరించడంలో ఈ రీశాట్-1బీ ఉపగ్రహం కీలక పాత్ర పోషించనుంది.






