RK Roja:‘సుపరిపాలన అంటే ఇదేనా పవన్’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రబుత్వం(AP Government) పై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

RK Roja:‘సుపరిపాలన అంటే ఇదేనా పవన్’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రబుత్వం(AP Government) పై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆమె పేర్కొన్నారు. అమలు చేయలేని హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను చేస్తున్నారని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా(Former Minister Roja) విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్(Super Six) హామీలను ఎప్పుడు అమలు చేస్తోందని ఆర్కే రోజా ప్రశ్నించారు.

ఈ క్రమంలో కూటమి ప్రభుత్వ(AP Government) ఏడాది పాలన, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సూపర్ సిక్స్ అమలు చేయకపోవడమే సుపరిపాలనా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Deputy CM Pawan Kalyan) అని ఆమె ప్రశ్నించారు. రూ.1.60లక్షల కోట్లు అప్పులు చేయడం సుపరిపాలన? విద్యుత్ చార్జీలు పెంచడం సుపరిపాలన? అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఏది సుపరిపాలనా పవన్ కళ్యాణ్ అంటూ మాజీ మంత్రి రోజా దుయ్యబట్టారు. ఈ తరుణంలో ఎవరు ఎక్కడ చస్తే నాకేంటి అన్నట్లు పవన్ కల్యాణ్ ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. విద్యార్థులు, రైతులు ఇబ్బందులు పడుతుంటే పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు.

Next Story