- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP News:అమెరికాకు కొడాలి నాని.. కారణం ఇదేనా?
వైసీపీ సీనియర్ నేత(YCP Leader), మాజీ మంత్రి కొడాలి నాని(Former Minister Kodali nani) అమెరికాకు వెళ్లనున్నట్లు సమాచారం.

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ సీనియర్ నేత(YCP Leader), మాజీ మంత్రి కొడాలి నాని(Former Minister Kodali nani) అమెరికాకు వెళ్లనున్నట్లు సమాచారం. కొడాలి నాని గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్(Hyderabad)లో విశ్రాంతి తీసుకుంటున్నట్టు సమాచారం. మార్చి నెలలో కొడాలి నాని గుండె సంబంధిత సమస్యలకు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత ముంబైలో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు.
ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాని ఆరోగ్యం పై పార్టీ శ్రేణులు ఆరా తీస్తున్నారు. కాగా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి లోకేష్(Minister Nara Lokesh) లపై కొడాలి నాని(Kodali Nani) పరుష పదజాలంతో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆ సయమంలో కొడాలి నాని పై మట్టి, ఇసుక అక్రమ రవాణా వ్యవహారాల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఈ తరుణంలో ఆయన అమెరికా పర్యటనకు పయనం అవుతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.






