‘ఇదేనా పవన్ కళ్యాణ్.. సనాతన ధర్మం’.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-31 10:30:55  IST  )

రాష్ట్రం(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై మాజీ మంత్రి రోజా మరోసారి విమర్శలు గుప్పించారు.

‘ఇదేనా పవన్ కళ్యాణ్.. సనాతన ధర్మం’.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రం(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై మాజీ మంత్రి రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం(AP Government)లో మనుషులకే కాదు.. చివరకు ఆ దేవదేవుడైన తిరుమల(Tirumala) శ్రీవారికి నిద్ర లేకుండా పోతోందని మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా(Former Minister Roja) మండిపడ్డారు. సంప్రదాయాల ప్రకారం భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి. అది భగవంతుని కోసమే కాకుండా మన కోసమూ.. సాంప్రదాయాలను పాటిస్తే భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడని ఆమె పేర్కొంది. వైఎస్ జగనన్న(YS Jagan) పాలనలో రోజుకు లక్ష మందికి పైగా భక్తులకు దర్శన భాగ్యం ఉండేవి.

కానీ ఇప్పుడు స్వామికి నిద్ర లేకుండా చేస్తూ, భక్తుల సంఖ్యను తగ్గిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 7 నుంచి 10 వేల వీఐపీ(VIP) బ్రేక్ దర్శనాలను తగ్గించారు. దీంతో సామాన్య భక్తులకు స్వామి దర్శనం మరింత దూరమవుతోంది. సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చి, డబ్బు ఉన్నవారికే దర్శన అవకాశం కల్పిస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan kalyan) సనాతన ధర్మం? ఇదేనా చంద్రబాబు(CM Chandrababu) ప్రక్షాళన? అని మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు. భగవంతుడు అన్ని గమనిస్తున్నాడంటూ ఆమె ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Read More..

Cabinet Expansion: ఆశావహులకు బ్యాడ్ న్యూస్.. మంత్రివర్గ విస్తరణ లేనట్లే?

Next Story