TDP:టీడీపీ మహానాడుకి జూ.ఎన్టీఆర్.. క్లారిటీ ఇదే!?

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-18 11:29:55  IST  )

TDP:టీడీపీ మహానాడుకి జూ.ఎన్టీఆర్.. క్లారిటీ ఇదే!?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ప్రతియేటా టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది టీడీపీ మహానాడు నిర్వహణకు టీడీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల(మే) 27, 28, 29 తేదీల్లో మహానాడు కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ క్రమంలో ఈ నెల(మే) 29వ తేదీన సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఉంటుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మూడు రోజుల పాటు కడప జిల్లాల్లో అట్టహాసంగా జరగనున్న మహానాడుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అయితే ఈ టీడీపీ(TDP) మహానాడు కార్యక్రమానికి సినీ నటుడు జూ.ఎన్టీఆర్ వస్తారా? అనే అంశం పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే, గతేడాది(2024) అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేష్‌(Minister Nara Lokesh)కు జూ.ఎన్టీఆర్ అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. అలాగే.. ఎన్టీఆర్‌కు RRR మూవీకి గానూ ఆస్కార్ రావడం పై అందరూ అభినందించారు. ఇకపోతే ఇటీవల జూ.ఎన్టీఆర్ నందమూరి కుటుంబ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం రాజకీయంగా కొత్త ఊహాగానాలకు తావిస్తోంది.

బాలకృష్ణ(Nandamuri balakrishna) పద్మభూషణ్ అందుకున్న సమయంలో ఎన్టీఆర్(Jr.NTR) స్పందించడం, పలు ఈవెంట్స్‌లలో నందమూరి కుటుంబ సభ్యులతో తీసుకున్న ఫొటోలు పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మహానాడు కార్యక్రమానికి ఎన్టీఆర్‌ను పిలిస్తే వస్తాడా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. జూ.ఎన్టీఆర్ మహానాడుకు హాజరవుతారనే విషయం పై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కానీ.. పార్టీ వర్గాలు మాత్రం అతిథుల జాబితాలో ఆయన పేరు ఉందనే సంకేతాలు ఇస్తున్నాయి. ఇక తారక్ మహానాడు కార్యక్రమానికి హాజరవుతారా? లేదా? అనే అంశం పై క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Next Story