- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap News: ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలకు రంగం సిద్ధం?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది...

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీల బదిలీలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి గత నెలలోనే బదిలీ ప్రక్రియ జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్, వరుస ప్రభుత్వ కార్యక్రమాల నేపథ్యంలో బదిలీల ప్రక్రియ నిలిచిపోయింది. దాంతో ప్రస్తుతం సీఎస్ డా.కేఎస్ జవహర్ రెడ్డి బదిలీ జాబితాను సిద్ధం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమోదం అనంతరం గురువారం సాయంత్రం లేదా శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా కలెక్టర్లు, ఎస్పీలపై ఫిర్యాదులు చేశారు. తమకు సహాయనిరాకరణ చేస్తున్నారని ఏకంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీల బదిలీలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.






