పవన్ కు మోడీ చాక్లెట్ ఇచ్చింది అందుకే కదా.. మాజీమంత్రి అంబటి ఎద్దేవా

by Ramesh Goud |

పవన్ కళ్యాణ్ కు స్థిరత్వం ఉండదని, అందుకే ఆయనకు మోడీ చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చాడని మాజీమంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు (YCP Leader Ambati Rambabu) ఎద్దేవా చేశారు.

పవన్ కు మోడీ చాక్లెట్ ఇచ్చింది అందుకే కదా.. మాజీమంత్రి అంబటి ఎద్దేవా
X

దిశ, వెబ్ డెస్క్: పవన్ కళ్యాణ్ కు స్థిరత్వం ఉండదని, అందుకే ఆయనకు మోడీ చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చాడని మాజీమంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు (YCP Leader Ambati Rambabu) ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం (YSRCP Office)లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కూటమి నేతలపై విమర్శల వర్షం గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) కు మాటల్లో స్థిరత్వం ఉండదని, ఒకసారి ముస్లింలు దేశ భక్తులు అని.. మరోసారి ఉగ్రవాదులు అని మాట్లాడుతారని అన్నారు. అలాంటి మాటలు మాట్లాడటం పవన్ కు సర్వ సాధారణం అని, ఆయన చిన్న పిల్లాడి లాంటోడని, అందుకే ప్రధాని మోడీ (PM Modi) చాక్లెట్ (Chocolate) ఇచ్చాడని వ్యంగ్యంగా స్పందించారు.

నా అభిప్రాయం ప్రకారం ఆయన ఎప్పుడు ఏం మాట మాట్లాడతాడో తెలియదని, ఆయన రాజకీయాలకు పనికిరాడని ముందే చెప్పానని కానీ మావాళ్లు ఓట్లు వేసి గెలిపించిన తర్వాత తెలుసుకున్నారని చెప్పారు. ఇక అమరావతి (Amaravathi) అనేది ఒక అంతులేని కథ అని, అమరావతి నిర్మించడంలో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అట్టర్ ప్లాప్ అయ్యారని మండిపడ్డారు. అమరావతి కోసం గత చంద్రబాబు ప్రభుత్వంలో 41 వేల కోట్లకు పైగా టెండర్లు పిలిచి 5,500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. చంద్రబాబు పాలనలో అమరావతి భ్రమరావతి (Bramaravathi) అయిందని, అందుకే చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడిపోయారని దుయ్యబట్టారు.

పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా విభజన చట్టంలో అవకాశం కల్పించారని, చంద్రబాబును అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డాడని అన్నారు. లక్ష కోట్లతో అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి మన రాష్ట్రలో ఆర్థిక వనరులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. రైతులకు అమరావతిలో ఫ్లాట్లు ఇస్తానని అందరికీ రిజిస్టర్ చేయలేదని, చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో అందరిని ముంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు అవకాశం ఇస్తే చంద్రబాబు అన్నీ తాత్కాలిక కట్టడాలు కట్టాడని, చదరపు అడుగుకు 11,000 ఖర్చుపెట్టి రాష్ట్రాన్ని దోచేశారని ఆరోపించారు. నేడు అమరావతి 2 మొదలు పెట్టారని, ఇప్పుడు మరో 45వేల ఎకరాలు కావాలంటున్నాడు.. ప్రధాని ముందు విభజన హామీల గురించి, పోలవరం ఎత్తుగురించి చంద్రబాబు కనీసం ప్రస్తావించలేదని అంబటి ఫైర్ అయ్యారు.

Next Story