భారీ వర్షాలు.. రేపు విద్యాసంస్థలకు సెలవు!

by Muthe.Rajitha |

ఏపీ(AP)లో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి.

భారీ వర్షాలు.. రేపు విద్యాసంస్థలకు సెలవు!
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొంది. కాగా ఇప్పటికే విజయవాడ, గుంటూరులో కుండపోత వర్షాలు కురుస్తుండగా.. రేపు స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ప్రకటించాలని కోరుతున్నారు. కాగా దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు.

Next Story