సీమ జిల్లాలకు జలకళ.. తొలిసారి నీరు డ్రా

by Vemula.Srinu Prasad |

రాయలసీమ జిల్లాలకు హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా ఇరిగేషన్ శాఖ అధికారులు నీళ్లు అందించారు...

సీమ జిల్లాలకు జలకళ.. తొలిసారి నీరు డ్రా
X

దిశ, వెబ్ డెస్క్: రాయలసీమ జిల్లాల(Rayalaseema District)కు హంద్రీ-నీవా ప్రాజెక్టు(Handri-Neeva Project) ద్వారా ఇరిగేషన్ శాఖ అధికారులు(Irrigation Department officials) నీళ్లు అందించారు. సాగు, తాగు నీరు కోసం ప్రాజెక్ట్ డిజైన్ కెపాసిటీని మించి తొలిసారి నీటిని డ్రా చేశారు. కేవలం 190 రోజుల్లోనే 40.109 టీఎంసీల మేర నీటిని రాయలసీమ జిల్లాలకు చెందిన రిజర్వాయర్లు, చెరువులకు మళ్లించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో కృష్ణా జలాలు అందించేందుకు హంద్రీ-నీవా విస్తరణ పనులను త్వరితగతిన చేపట్టారు. చివరి ఎకరా వరకు నీళ్లు అందించాలని, సీమ ప్రాంతాన్ని సస్య శ్యామలం చేయాలనే లక్ష్యంతో పని చేశారు. దీంతో హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా సీమ జిల్లాలకు నీటి తరలించారు. దీంతో ఏపీ ఇరిగేషన్ శాఖ సరికొత్త రికార్డు సృష్టించింది.

Next Story