- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమరావతిలో పండుగ శోభ.. ప్రత్యేక ఆకర్షణగా ఐరన్ శిల్పాలు
రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభోత్సవం సందర్భంగా సభా ప్రాంగణం వద్ద వేస్ట్ ఐరన్‌తో తయారు చేసిన శిల్పాలు (Iron Statues) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

దిశ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ (PM Modi) అమరావతి (Amaravati) పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో.. రాజధానిప్రాంతంలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఈ వేడుకకు రాజధాని చుట్టుపక్కల జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఏపీకి శాశ్వత రాజధాని కావాలన్న చిరకాల స్వప్నం సాకారమవుతుందని ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన గ్యాలరీలు ఇప్పటికే నిండిపోవడంతో.. ఆ ప్రాంగణం జనసందోహాన్ని తలపిస్తోంది.
రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభోత్సవం సందర్భంగా సభా ప్రాంగణం వద్ద వేస్ట్ ఐరన్‌తో తయారు చేసిన శిల్పాలు (Iron Statues) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (NTR), ప్రధాని నరేంద్రమోదీ, బుద్ధుడు, కాలచక్రం, సైకిల్, అమరావతి అనే అక్షరాలతో పాటు మేక్ ఇన్ ఇండియా (Make in India) లోగో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. తెనాలికి చెందిన కాటూరి వెంకటేశ్వరరావు అనే శిల్పి తన టీమ్ తో కలిసి ఐరన్ స్క్రాప్‌తో వీటిని ఏర్పాటు చేశారు. మెకానిక్ షెడ్లు, ఇతర ప్రాంతాల్లో వృథాగా పడేసిన కాగా.. ప్రధాని నరేంద్రమోడీ సాయంత్రం రూ.57,940 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.






