నేటితో పూర్తికానున్న సునీల్ నాయక్ విచారణ.. అరెస్ట్ చేస్తారా?

by Naga Rani Yarlagadda |

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ 5 రోజుల సీఐడీ విచారణ నేటితో ముగియనుంది.

నేటితో పూర్తికానున్న సునీల్ నాయక్ విచారణ.. అరెస్ట్ చేస్తారా?
X

దిశ, వెబ్‌డెస్క్: గత ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో సునీల్ నాయక్ విచారణ కొనసాగుతోంది. సునీల్ నాయక్ ను విచారించేందుకు హైకోర్టు ఐదు రోజులు ఇవ్వగా.. నేటితో ఆ గడువు పూర్తికానుంది. ఉదయం 9.57 గంటలకు సునీల్ నాయక్ గుంటూరు సీసీఎస్ పీఎస్ కు చేరుకోగా.. 10 గంటల నుంచి కేసు దర్యాప్తు అధికారి.. విజయనగరం ఎస్పీ దామోదర్ సునీల్ నాయక్ ఆయన్ను విచారిస్తున్నారు. తొలుత సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో సునీల్ నాయక్ ను 15 నిమిషాలపాటు ప్రశ్నించిన పోలీసులు.. రఘురామ కస్టోడియల్ టార్చర్ సీన్ ను రీక్రియేషన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన్ను సీఐడీ కార్యాలయం నుంచి గుంటూరు సీసీఎస్ కు తరలించారు. సాయంత్రం 5 గంటల వరకూ సునీల్ నాయక్ విచారణ కొనసాగనుంది. కాగా.. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా సునీల్ నాయక్ మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. బెయిల్ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేస్తే.. సునీల్ ను పోలీసులు అరెస్ట్ చేసే చాన్స్ ఉంది.

కాగా.. ఆదివారం సుమారు 7 గంటలపాటు సునీల్ నాయక్ ను విచారించిన అధికారి.. ఆయనకు కొన్ని సాంకేతిక ఆధారాలను చూపించి ప్రశ్నించగా సమాధానమివ్వకుండా మౌనం వహించినట్లు తెలుస్తోంది. ఒక ఎంపీని కస్టడీలో ఉంచినపుడు సీసీ కెమెరాలు పెట్టాలని తెలియదా? తెలిసినా కావాలనే పెట్టలేదా ? మీ వెంట ఉన్న గన్ మెన్లను ఎందుకు బయటకు పంపారు? ఇలా పలు ప్రశ్నలు సంధించగా వాటికి ఆయన సమాధానమివ్వలేదని తెలుస్తోంది. ఎంపీని కస్టడీలో ఉంచినపుడు కేవలం పర్యవేక్షించేందుకే వెళ్తే.. ఆయన్ను టార్చర్ చేసినపుడు ఏం చేశారని గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. ఓవరాల్ గా విచారణలో సునీల్ నాయక్ చాలా ప్రశ్నలకు సమాధానమివ్వలేదనే తెలుస్తోంది.

Next Story